Gold Rates Today : సరికొత్త రికార్డుల దిశగా బంగారం...షాక్ ల మీద షాక్ ఇచ్చే విధంగా?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొద్దిగా పెరుగుదల కనిపించింది.
బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోయే వార్త లేదు కానీ.. ఏమైనా బంగారం ధరలు తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్న వారికి మాత్రం బంగారం ధరలు దిగిరాకపోగా, ఇంకా ఎక్కువవుతున్నాయి. కొందరు బంగారం ధరలు తగ్గుతాయని అంచనాలు వినిపిస్తుంటే, మరికొందరు మాత్రం పెరిగిన బంగారం ధరలు తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు ఊగిసలాటలో ఉన్నారు. ఇంకా తగ్గుతుందేమోనని చాలా మంది వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. కానీ బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. ఎందుకంటే అనేక కారణాలతో ప్రతి రోజూ బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
లక్షన్నరకు చేరుకోవడానికి...
పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్ష ఇరవై వేల రూపాయలకు చేరుకుంది. బంగారం ధర లక్షా యాభై వేల రూపాయలకు చేరుకునే దూరం ఎంతో సమయం పట్టదని చెబుతున్నారు. అలాగే కిలో వెండి ధర ఇప్పటికే లక్షా అరవై వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర కూడా త్వరలో రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లు మందగించాయి. జ్యుయలరీ దుకాణాల్లో అమ్మకాలు బాగా పడిపోయాయి. బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే ఆస్తిపాస్తులున్నవారు, స్థితిమంతులు మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితికి ఇప్పటికే చేరుకుంది. అయితే ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మళ్లీ పెరిగి...
పెళ్లిళ్లు, పండగలు సీజన్ నడుస్తుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది. పెట్టుబడి పెట్టే వారు కూడా ప్రత్యామ్నాయంగా సురక్షితమైన పెట్టుబడుల వైపు వెళుతున్నారు. బంగారం, వెండి కొనుగోలుకు దూరంగా ఉన్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొద్దిగా పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,10,710 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,20,780 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,67,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.