Gold Prices Today : గత ఏడాది రికార్డులను ఈ ఏడాది తొలి నెలలోనే బంగారం బ్రేక్ చేస్తుందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు పెరుగుదల ఆగేటట్లు కనిపించడం లేదు. వెండి ధరలు కూడా అందడం లేదు. బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న హెచ్చరికలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఈ ఏడాది గత ఏడాది రికార్డులను బ్రేక్ చేసేటట్లే కనిపిస్తుంది. కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు కొంత తగ్గుతున్నట్లు కనిపించినప్పటికీ మళ్లీ వేలల్లో ప్రతి రోజూ ధరలు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ధరలు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో దాని ప్రభావం ఖచ్చితంగా కొనుగోళ్లపై పడుతుంది. అందులోనూ వచ్చే నెల వరకూ శుభముహూర్తాలు లేవు. మార్చి నెల నుంచి మళ్లీ పెళ్ళిళ్ల సీజన్ నడుస్తుంది. దానికంటే ముందే ధరలు అదిరిపోతున్నాయి.
బంగారం కొనాలంటే...?
బంగారం అంటే ఒక్కప్పుడు ఆభరణాలుగా మాత్రమే చూసేవారు. అలంకారం కోసం వాడేవారు. బంగారం కంటే ప్లాటినం ధరలు ఎక్కువగా ఉండటంతో కొద్ది కాలం ప్లాటినం ఆభరణాల వినియోగం ఎక్కువగా జరిగింది. కానీ ఇప్పుడు ధరలు చూస్తే బంగారం కంటే ప్లాటినం బాగా చీప్ అయిపోయినట్లు కనిపిస్తుంది. మరొకవైపు బంగారం ప్లేస్ లో ఎక్కువ మంది గిల్టు నగలు వాడుతున్నారు. వన్ గ్రామ్ గోల్డ్ కు కూడా డిమాండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిందని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. మరొకవైపు బంగారం ధరలు పెరగడంతో ఇక డైమండ్ జ్యుయలరీపై మహిళలు మక్కువ పెంచుకుంటున్నారని వ్యాపారులే చెబుతున్నారు.
నేటి ధరలు...
ఇక బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడి దారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూుతున్నారు. దీంతో పాటు అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి పతనం భారీగా ఉండటం కూడా కారణమవుతుంది. నిన్న ఒక్క రోజే రెండు వేల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై ఎనిమిది వేల రూపాయలు పెరిగింది. తాజాగా మంగళవారం కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 1,26,710 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,230 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,65,100 రూపాయలకు చేరుకుంది.