Gold Price Today : షాకింగ్.. ఇంతగా ధరలు పెరిగితే ఎలా? బంగారం నేటి ధరలు ఇలా
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి
బంగారం ధరలు వరసగా పెరుగుతూనే ఉన్నాయి. ఆల్ టైం హైకి చేరుకున్నాయి. వరసగా ఆరు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నాన్ స్టాప్ గా బంగారం ధరలు పెరుగుతుండటంతో ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నట్లయింది. వెండి ధరలు కూడా అదే తరహాలో పరుగులు పెడుతున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో ఇక బంగారాన్ని కొనుగోలు చేయడం కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే బంగారం అందనంత ధరలకు ఇప్పటికే ఎగబాకింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారులకు నిరాశ...
మరొకవైపు బంగారం ధరలు తగ్గుతాయేమోనని ఎదురు చూస్తున్న వారికి ప్రతి రోజూ నిరాశ మిగులుతుంది. ప్రతి రోజూ ధరలు పెరగడంతో పాటు భారీగా పెరగడంతో పాటు ఇప్పటికే బంగారం ధరలు పది గ్రాములు లక్షా ఆరు వేల రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఈ రెండు వస్తువులను కొనుగోలు చేయడం అసాధ్యంగా మారింది. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్న కామెంట్స్, సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావితం చేస్తున్నాయి.
భారీగా పెరిగి...
మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. అలాగే పండగ సీజన్ కూడా మొదలయింది. ఈ సమయంలో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం కష్టంగా మారడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలతో వ్యాపారులు కూడా బెంబేలెత్తుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై 800 రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,060 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,05,890 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,25,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశముంది.