Gold Rates : మధ్యాహ్నానికి పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
హైదరాబాద్ లో బంగారం ధర మరోసారి పెరిగింది.
హైదరాబాద్ లో బంగారం ధర మరోసారి పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై 390 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై 150 రూపాయలు పెరిగింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం ఉన్న ధరలు మధ్యాహ్నానికి ఉండటం లేదు. దీంతో జ్యుయలరీ దుకాణాలకు వెళ్లిన వారు పెరిగిన ధరలు చూసి అవాక్కవుతున్నారు.
వెండి ధరలు కూడా...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 123,460 రూపాయలకు చేరకుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,500 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,54,350 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.