Gold Rates Today : ఇదేమి తగ్గుదల సామీ.. పది గ్రాములపై పది రూపాయలు తగ్గడాన్ని తగ్గడమంటారా?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తగ్గినా పదో పరకో.. తగ్గి కన్నీళ్లు తుడిచామన్నట్లుగా ఉంటుంది తప్ప బంగరాం ధరలు మాత్రం ఇంకా పూర్తిగా దిగిరాలేదన్నది వాస్తవం. సెప్టంబరు నెలలో పది గ్రాముల బంగారం లక్ష రూపాయలకు చేరుకుంది. కానీ లక్ష రూపాయల నుంచి ఇప్పటి వరకూ దిగిరాలేదు. అంటే బంగారం ధర తగ్గిందనుకోవాలా? పెరిగిందనుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. గోల్డ్ రేట్స్ ఎప్పుడూ పెరుగుతుంటాయి. ధరలు అందుబాటులోకి వస్తాయన్న గ్యారంటీ లేదు. ఆ నమ్మకం వినియోగదారులు కోల్పోయిన తర్వాత ఇక కొనుగోళ్లు కూడా పెరిగే అవకాశం లేదు.
డిమాండ్ తగ్గని బంగారం...
కానీ బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దానికి సీజన్ తోనూ, డిమాండ్ తోనూ సంబంధం లేదని ఎవరిని అడిగినా చెబుతారు. భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిన బంగారానికి విలువ ఎంత పెరిగినా డిమాండ్ అనేది తగ్గదన్నది అందరి నోట వినిపిస్తున్న మాట. కానీ కొనుగోలు చేయగల శక్తి ఉంటే తప్ప బంగారాన్ని కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి తోడు అనేక రకాల పన్నులతో పాటు జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం విధించే తరుగు వంటి వాటితో ధరలు మరింత పెరిగి వినియోగదారులను మరింతగా నిరాశకు గురి చేస్తున్నాయి. పండగ, పెళ్లిళ్ల సీజన్ లో కూడా కొనుగోళ్లు పెద్దగా జరగడం లేదు.
స్వల్పంగా తగ్గినా...
పెళ్లిళ్లు, పండగల సమయంలో బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు కూడా ధరలు ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎంత పెరిగినా ధరలను అదుపు చేయడం ఎవరి చేతుల్లోనూ లేదని అంటున్నారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర 1,02,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,140 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,34,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది.