Gold Price Today : అక్షర తృతీయకు ముందు ఒక అడుగు వెనక్కు వేసిన పుత్తడి

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో తగ్గాయి

Update: 2024-05-04 03:54 GMT

పుత్తడి ఎప్పుడూ విలువైనదే. ఎంతగా అంటే.. దానిని ప్రేమించని వాళ్లు ప్రపంచంలోనే ఉండరు. మహిళల మీద తోసేస్తాం కానీ.. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ఉంటే ఒక భరోసా. స్టేటస్ సింబల్. కష్టకాలంలో ఆదుకునే వస్తువు కావడంతో బంగారానికి ఎప్పుడూ గిరాకీ తగ్గదు. పసిడి ప్రియులు కొంటూనే ఉంటారు. ఇంత బంగారం మన వద్ద ఉంది కదా? అని ఆగరు. ఇంకా కావాలని కోరుకునే వస్తువు బంగారం, వెండి కావడంతో వాటి ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి.

అడ్వాన్స్ బుకింగ్ లు...
ముఖ్యంగా అక్షర తృతీయకు బంగారం కొనుగోలు చేస్తే మంచిదని, శుభసూచకమని చెబుతారు. అందుకే ఆరోజు అవసరం లేకపోయినా కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు. అందుకే బంగారం ధరలకు ఒక సీజన్ అంటూ ఉండదు. ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు లేకపోయినప్పటికీ అక్షర తృతీయ తమ వ్యాపారాన్ని మరింత పెంచుతుందన్న భావనలో వ్యాపారులున్నారు. ఆరోజు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారంటే పసిడికి ఎంత పరవశించిపోతున్నారో వేరే చెప్పాల్సిన పనిలేదు.
నేటి ధరలు ఇలా...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో తగ్గాయి. నిన్న తులం బంగారం పై ఐదు వందల రూపాయలు తగ్గింది. వెండి ధరలు మాత్రం నిన్న స్థిరంగానే కొనసాగాయి. నేడు మాత్రం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,740 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,720 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 83,400 రూపాయలకు చేరుకుంది.



Tags:    

Similar News