Gold Prices Today : డెబ్భయి వేలు దాటేసిన పసిడి.. ఇక లక్షకు కొద్ది దూరంలోనే అంటూ

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ధరలను నియంత్రణ సాధ్యం కావడం లేదు.

Update: 2024-04-07 03:25 GMT

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ధరలను నియంత్రణ సాధ్యం కావడం లేదు. దీంతో కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలా పెరుగుతూ పోతే మాత్రం త్వరలోనే పది గ్రాముల బంగారం ధర లక్షకు చేరుకునే అవకాశం ఉందన్నది మార్కెట్ నిపుణుల అంచనా మేరకు వినిపిస్తుంది. ఆ రోజు ఎంతో దూరం లేదట. పది గ్రాముల బంగారం లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేయాలంటే ఎవరికి సాధ్యమవుతుంది. పేదా, బిక్కి, మధ్యతరగతి వాళ్లకు అసలు బంగారం వైపు చూడలేని పరిస్థితి రానున్న రోజుల్లో రానుందన్న విశ్లేషణలు భయం గొలిపేలా ఉన్నాయి.

వెండి కూడా....
పసిిడి ధరలు ఆగకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇంతలా పెరగడం ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. వెండి ధరలు కూడా దాంతో పాటే తామేం తక్కువా? అన్నట్లు ఆకాశం వైపు చూస్తున్నాయి. దీంతో మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారం, వెండి ధరలు మాత్రం ఇక సామాన్యులకు అందుబాటులో ఉండవన్నది మాత్రం యదార్థం. కిలో వెండి లక్ష రూపాయలకు చేరుకునే రోజు కూడా దగ్గరలోనే ఉందన్నది కూడా వ్యాపారులు చెబుతున్న మాట.
నేడు స్థిరంగా ఉన్నా...
ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. బంగారం ధరలు మాత్రం ఎవరూ కొనలేని పరిస్థితులకు చేరుకున్నాయి. వెండి ధరలు కూడా అంతే వేగంగా పరుగులు పెడుతున్నాయి. దిగుమతులను తగ్గించిన కారణంగానే ధరలు పైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,350 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,290 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 87,000 రూపాయలుగా ఉంది.



Tags:    

Similar News