Gold Rates Today : షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు ఒక్కసారిగా ఎంత పెరిగాయో తెలుసా?
బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి
బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆల్ టైం రికార్డుకు చేరుకున్న బంగారం ధరలు మరింత వేగంగా పరుగులు తీస్తాయని అంటున్నారు. బంగారం కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. గత నెల రోజుల నుంచి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగి రాకపోగా ఇంకా పైపైకి పెరుగుతుంది. వెండిధరలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ధరలు ఇంతలా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు మాత్రం ఆసక్తి చూపకపోవడంతో అమ్మకాలు మందగించాయి. కొనుగోళ్లు లేకపోవడంతో జ్యుయలరీ దుకాణాలు వినియోగదారులు లేక వెలవెల బోతున్నాయి.
ధరలు పెరగడానికి...
బంగారం ధరలు ఇంతలా పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో పాటు ఇటీవల భారత్ పై అమెరికా విధించిన అదనపు సుంకాలతో బంగారం ధరలు పెరిగాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు ఒక్కసారి పెరిగితే ఇక తగ్గేది అనేది జరగదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్యుడికి ధరలు అందుబాటులో లేకపోవడంతో డిమాండ్ కూడా భారీగా తగ్గింది. అయినా ధరలు మాత్రం పెరుగుదల నిలిచపోవడం లేదు. మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి.
భారీగా పెరగడంతో...
ప్రధానంగా పండగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారం కొనుగోలు చేస్తారని ఎక్కువగా అంచనాలున్నా, ఆశించినంత మేరకు జరగడం లేదు. పెట్టుబడి పెట్టే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు తమ పెట్టుబడులను మళ్లించారు. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,660 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,07,630 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,35,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశముంది.