తెలుగోళ్లు కుబేరులు.. ఫోర్బ్స్ జాబితాలో ఆరుగురికి చోటు
దేశంలో అత్యంత సంపన్నులైన ఫోర్బ్స్ జాబితా విడుదలయింది.
దేశంలో అత్యంత సంపన్నులైన ఫోర్బ్స్ జాబితా విడుదలయింది. దీంతో ఎప్పటిలాగా రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రధమ స్థానంలో నిలిచిారు. ముఖేశ్ అంబానీ ఆస్తి 10,500 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ జాబితా పేర్కొంది. భారతీయ కరెన్సీలో 9.32 లక్షల కోట్ల రూపాయలుగా పేర్కొంది. అయితే ముఖేశ్ అంబానా ఆస్తి గత ఏడాదితో పోలిస్తే పన్నెండు శాతం తగ్గిందని ఫోర్బ్స్ జాబితా పేర్కొంది. తర్వాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 8.17 లక్షల కోట్ల రూపాయాల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు.
అత్యంత ధనవంతులుగా...
మూడోస్థానంలో ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్మన్ సావిత్రి జిందాల కుటుంబం 3.52 లక్షల కోట్ల రూపాయలతో మూడో స్థానంలో ఉంది. అయితే నాలుగో స్థానంలో భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్, ఐదో స్థానంలో హెచ్.సి.ఎల్. వ్యవస్థాపకుడు శివనాడార్ ఉన్నారు. ఇక మన తెలుగు వాళ్లు కూడా దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ జాబితా లో తెలుగోళ్లకు ఆరుగురికి స్థానం లభించడం విశేషం. దేశంలోని ధనవంతులుగా తెలుగు వాళ్లు ఫోర్బ్స్ జాబితా లో ప్లేస్ దక్కించుకున్నారు.
ఆరుగురు వీరే...
ఇరవై ఐదో స్థానంలో దివి మురళి, 70వ స్థానంలో పి. కృష్ణారెడ్డి, 83వ స్థానంలో జీఎం రావు, 86వ స్థానంలో ప్రతాప్ రెడ్డి, 89వ స్థానంలో బి. పార్ధసారధి రెడ్డి, 91వ స్థానంలో డాక్టర్ రెడ్డీస్ కుటుంబం ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ పరిశ్రమలను స్థాపించి అత్యంత ధనవంతులుగా ఎన్నికయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఫోర్బ్స్ జాబితా లో ప్లేస్ దక్కించుకోవడాన్ని హర్షిస్తున్నారు. అనేక దఫాలుగా వీరు ఈ స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నారు.