చికెన్ ధర ఎంతో తెలుసా? తెలిస్తే.. సినిమాలో కోట శ్రీనివాసరావు అవ్వాల్సిందే

కార్తీక మాసం పూర్తి కావడంతో మాంసాహార ప్రియులు చికెన్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు బాగా పెరిగాయి

Update: 2023-12-17 05:58 GMT

chicken price

కార్తీక మాసం పూర్తి కావడంతో మాంసాహార ప్రియులు చికెన్ కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కార్తీక మాసంలో ఎక్కువ మంది మాంసాహారం తినకపోవడంతో చికెన్ ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి. మొన్నటి వరకూ కిలో చికెన్ ధర 120 రూపాయలు మాత్రమే పలికింది. అయితే కార్తీకమాసం పూర్తి కావడంతో చికెన్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో కిలో చికెన్ ధరలు 220 రూపాయలకు చేరుకున్నాయి.

కోడిగుడ్డు ధరలు కూడా....
చికెన్ తో పాటు కోడిగుడ్డు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఒక్కొక్క కోడిగుడ్డు ధర ఏడు రూపాయల వరకూ పలుకుతుంది. మొన్నటి వరకూ ఐదు రూపాయలు పలికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజునే ఏడు రూపాయలకు పెరిగింది. డిమాండ్ పెరగడంతో దొరకడం కూడా కష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువుకు సహజంగా ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి.


Tags:    

Similar News