Indian Railways: ప్రయాణికులకు అలర్ట్‌.. డిసెంబర్‌ 15 నుంచి ఈ రైళ్లు రద్దు!

భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు డివిజన్లలో ట్రాక్

Update: 2023-12-15 03:05 GMT

Indian Railways

భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు డివిజన్లలో ట్రాక్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇది రైలు సేవలను ప్రభావితం చేస్తుంది. రైల్వేలు అనేక రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించడం లేదా రీషెడ్యూల్ చేయడం వంటివి చేస్తూనే ఉన్నాయి. వివిధ జోన్‌ల రైల్వేలు ఈ సమాచారాన్ని తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూనే ఉంటాయి.

నైరుతి రైల్వే తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో రద్దయిన రైళ్ల గురించి సమాచారాన్ని పంచుకుంటూ, రైలు నంబర్లు 01595, 01596 కార్వార్-మడ్గావ్ జంక్షన్-కార్వార్ డైలీ స్పెషల్‌లను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ రైలు డిసెంబర్ 15 మరియు 21 మధ్య పూర్తిగా రద్దు చేసింది. తిరిగి డిసెంబర్ 21 నుండి తిరిగి ప్రారంభమవుతాయి.

నార్త్ వెస్ట్రన్ రైల్వే ఈ రైళ్లను రద్దు చేసింది

అజ్మీర్‌ డివిజన్‌లో కొనసాగుతున్న బ్లాక్‌ పనుల కారణంగా ట్రాఫిక్‌ స్తంభించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయాలని నార్త్ వెస్టర్న్ రైల్వే నిర్ణయించింది. ఇందులో జోధ్‌పూర్-సబర్మతి (14821) డిసెంబర్ 15న, సబర్మతి-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (14822) డిసెంబర్ 16న రద్దు అయ్యాయి. భగత్ కీ కోఠి-బాంద్రా టెర్మినస్ (19411) డిసెంబర్ 15న రద్దు, ఇది కాకుండా సబర్మతి-దౌలత్‌పూర్ చౌక్ (20944) డిసెంబర్ 15న, దౌలత్‌పూర్ చౌక్-సబర్మతి (19412) డిసెంబర్ 16న రద్దు కానున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఈ రైళ్లలో ప్రయాణించబోతున్నట్లయితే, దాని షెడ్యూల్‌ను ఒకసారి చూసుకోవడం మంచిది.


ఉత్తర రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది

ఉత్తర రైల్వే, లక్నో డివిజన్, బారాబంకి-అయోధ్య కాంట్-షాహ్‌గంజ్-జఫ్రాబాద్ సెక్షన్‌లో ట్రాక్‌ను డబ్లింగ్ చేసే పని కారణంగా వచ్చే ఒక నెల పాటు అనేక రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది. రద్దయిన రైళ్ల జాబితాలో లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ (15204), గోరఖ్‌పూర్-లక్నో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12531/32), గోమతి నగర్-ఛప్రా కచారి ఎక్స్‌ప్రెస్ (15113), గోరఖ్‌పూర్-ఐష్‌బాగ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (15069), ఛప్రా-మథుర ఎక్స్‌ప్రెస్. (22531/32) వంటి అనేక రైళ్లు డిసెంబర్ 15న రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.




Tags:    

Similar News