Budget 2024: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలు

Budget 2024: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ-2 ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న (మధ్యంతర బడ్జెట్‌..

Update: 2024-01-11 13:00 GMT

Budget 2024

Budget 2024: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ-2 ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న (మధ్యంతర బడ్జెట్‌) ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు అంటే జనవరి 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

ఇండియా టుడేలో వచ్చిన కథనం ప్రకారం బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. జనవరి 31 నుంచి 11 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో పెద్దగా ప్రకటనలు లేకపోయినా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించవచ్చని అంటున్నారు.

ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున అంతకు ముందు వచ్చే బడ్జెట్‌ మధ్యంతర బడ్జెట్‌. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు, ప్రభుత్వం అవసరమైన వ్యయాన్ని ఆమోదించడానికి, ఆర్థిక వ్యవస్థకు నిధుల కేటాయింపును సజావుగా చేయడానికి మధ్యంతర బడ్జెట్, ఓటు ఆన్ అకౌంట్ ఉంటుంది.

మధ్యంతర బడ్జెట్‌లో భారీ ప్రాజెక్టులు ప్రకటించలేరు. ఎన్నికల్లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు విధించారు. అలాగే ఆర్థిక సర్వేను మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. అయితే సమగ్ర ఆర్థిక సర్వేకు బదులుగా, ఇది 2024-25 సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై బులెటిన్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది. బడ్జెట్‌ సమర్పణకు ముందే ఇది చేయవచ్చు.

Tags:    

Similar News