YSRCP : వైసీపీ నేత కారుమూరి అరెస్ట్

వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2025-11-18 06:27 GMT

వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. ఒక పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

సోషల్ మీడియాలో...
కారుమూరి వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆయనపై కేసు నమోదయినట్లు పోలీసులు తెలిపారని కారుమూరి వెంకటరెడ్డి సతీమణి తెలిపారు. తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News