కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై చంద్రబాబు ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా అరకు రీజియన్ అభివృద్ధి అంశాన్ని కేంద్ర బడ్జెట్ లో పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పులికాట్ సరస్సు అభివృద్ధికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఫ్లెమింగోలు అరుదైన పక్షులు కూడా ఆ ప్రాంతానికి ఆలవాలంగా ఉంటాయన్నారు. ఈస్ట్ కోస్ట్ కారిడార్ వల్ల లాజిస్టిక్స్ పరంగా గణనీయమైన వృద్ధి నమోదు అవుతుందని తెలిపారు. అంతర్గత జలరవాణాకు కూడా ఊతమిచ్చేలా బడ్జెట్లో నిధులు పెట్టారు. వెయ్యి కిలోమీటర్ల పొడవైన ఏపీ తీర ప్రాంతం అంతా గణనీయమైన వృద్ధి చెందుతుందన్నారు. లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఇప్పటికే ఏర్పాటు చేశామన్న చంద్రబాబు పట్టణాల అభివృద్ధి, గ్రోత్ సెంటర్లకు నిధులు కేటాయించారన్నారు. విశాఖ ఆర్ధిక రీజియన్ , తిరుపతి గ్రోత్ రీజియన్, అమరావతి రీజియన్లు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందన్న చంద్రబాబు కంటైనర్స్ ద్వారా లాజిస్టిక్స్ మరింత వేగవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగ అవకాశాలు...