Breaking : అంబటి రాంబాబు ఇంటి దాడిపై హైకోర్టు సీరియస్

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దాడిపై హైకోర్టు సీరియస్ అయింది

Update: 2026-02-01 13:03 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దాడిపై హైకోర్టు సీరియస్ అయింది. అంబటి కుటుంబానికి ఇరవై నాలుగు గంటల పాటు భద్రత ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి నిన్న తన ఇంటిపై జరిగిన దాడులపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేశారు. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకూ భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.

హౌస్ మోషన్ పిటీషన్ పై...
చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిన్న గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఫర్నీచర్ ను, కార్యాలయాన్ని తగులపెట్టారు. రాత్రి సమయంలో అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. అయితే ఈ కేసులో హౌస్ మోషన్ పిటీషన్ వేయడంతో అంబటి కుటుంబానికి రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.


Tags:    

Similar News