రాజమండ్రి ప్రాంతంలో పులి... స్కూళ్లకు సెలవులు

రాజమండ్రి ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది

Update: 2026-02-02 04:30 GMT

రాజమండ్రి ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది. తొర్రేడుమండలం హైస్కూలు సమీపంలోని అరటి తోటల్లో పెద్దపులి కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకు చేరువలో పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పులి సీతానగరం మండలం రాపాక గ్రామం వైపు వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

పెద్దపులిని పట్టుకునేందుకు...
పెద్దపులిని పట్టుకునేందుకు పదిహేను ట్రాప్ కెమెరాలతో పాటు, రెండు బోన్లను ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్ కెమెరాల సాయంతో పెద్దపులి జాడను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. సమీప గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరారు. అయితే పెద్దపులి ఇక్కడే తిరుగుతుండటంతో సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.


Tags:    

Similar News