Ys Jagan : జోజినగర్ లో జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ భవానీపురంలో పర్యటిస్తున్నారు

Update: 2025-12-16 07:44 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ భవానీపురంలో పర్యటిస్తున్నారు. జోజినగర్ లో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించారు. జోజినగర్ లో ఇటీవల 42 ఇళ్లను కూల్చివేయడంతో వారు జగన్ వద్దకు వచ్చి తమ గోడును చెప్పుకోవడంతో నేడు వారి వద్దకు వచ్చారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా జగన్ కు వారు వివరించారు.

బాధితులకు పరామర్శ...
కొన్నేళ్ల నుంచి తాము ఇక్కడే ఉంటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నామని, న్యాయస్థానాల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తమ ఇళ్లను పోలీసులతో కలసి కూల్చివేశారని బాధితులు వాపోయారు. అయితే ఈ సందర్భంగా జగన్ వారికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయపరంగా ఏ అవసరమైనా పార్టీ అందిస్తుందని తెలిపారు.


Tags:    

Similar News