YSRCP : వైసీపీ ఎమ్మెల్సీ బొత్స కు షాకిచ్చిన సోదరుడు.. జనసేనలోకి జంప్
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.
botsa satyanarayana
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఆయన కుటుంబంలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 3వ తేదీన లక్ష్మణరావు జనసేనలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు.
ఆయనతో పాటు...
ఈ మేరకు లక్ష్మణరావు అధికారికంగా ప్రకటించారు. నెలిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిని కలసి తాను జనసేనలో చేరాలని కోరుకుంటున్నట్లు తెలపగా, అందుకు ఆమె అధినాయకత్వానికి సమాచారం అందించి ఓకే చెప్పినట్లు తెలిసింది. బొత్స లక్ష్మణరావులతో పాటు కొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడా జనసేనలో చేరే అవకాశముంది.