Ys Sharmila : వైఎస్ జగన్ కు షర్మిల మరో సవాల్
వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ కు మరో సవాల్ విసిరారు
వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ కు మరో సవాల్ విసిరారు. జగన్ కి దమ్ముంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ పై పెట్టే అభిశంసన కి మద్దతు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. వైసీపీ ఎంపీలు ఇండికూటమి ఎంపీలతో కలిసి సంతకాలు పెట్టాలని కోరారు. అభిశంసన కు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా ? నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఎక్కడ పోయాయో అని బీద ఏడుపులు ఏడ్చారు కదా ? మరి ఇప్పుడు సంతకాలు పెట్టడానికి ఏమయిందన్నారు.
చిత్తశుద్ధి ఉంటే...
కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు .. దొంగ తనంగా ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పారు కదా ? జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇండియా కూటమి పెట్టే తీర్మానానికి మద్దతు ప్రకటించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి మోడీ కి దత్తపుత్రుడు కాదని నిరూపించుకోవాలని షర్మిల కోరారు. దేశంలో మోదీ ఎన్నికల సంఘాన్ని చేతుల్లో పెట్టుకున్నారన్న వైఎస్ షర్మిల సీఈసీ జ్ఞానేశ్వర్ అవసమైన చోట దొంగ ఓట్లు, అవసరం లేని చోట ఓట్లు తొలగిస్తున్నారని, ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా పని చేస్తోందని చెప్పారు.