తిరుమలలో భక్తులకు ఇక త్వరిగతిన దర్శనం
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. రద్దీ నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు దర్శించే పుణ్య క్షేత్రం కావడంతో జనసాంద్రత, దర్శన‑సమయాలను సమర్థంగా నిర్వహించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు...
AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జనసాంద్రత, దర్శనం కొసం వేచి ఉండే సమయం, వాహన చలనం, వసతి, సీసీటీవీ వాతావరణం, వైద్య అత్యవసరాలు అన్నీ ఒకే ప్లాట్‌ఫారం ద్వారా రియల్ టైమ్‌లో పర్యవేక్షణ కొనసాగుతుంది. AI‑ఆధారిత విశ్లేషణ ద్వారా రద్దీ పెరిగే పరిస్థితులను ముందే అంచనా వేసి క్యూ మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించేందుకు ఆస్కారం ఉండనుంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో టీటీడీలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రముఖ ఆలయాలకు కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం స్పూర్తిగా నిలుస్తుంది.