తిరుమలలో చంద్రబాబు కుటుంబం

తిరుమల వేంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు

Update: 2026-03-21 03:12 GMT

తిరుమల వేంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారా ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా శ్రీవారి దర్శనానికి సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు వెళ్లారు. ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళినా వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుంచే దర్శనానికి చంద్రబాబు నాయుడు వెళతారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమలకు నిన్న చేరుకుంది. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, దేవాన్ష్ లు ఉన్నారు.

అన్నదాన ట్రస్ట్ కు...
శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ లో అన్న ప్రసాద వితరణ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం చేయనున్నారు. ఒక్కరోజు అన్నదానానికి వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే అందించిన సీఎం కుటుంబం ఇప్పటికీ పన్నెండుసార్లు అన్నదానానికి ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కు విరాళం సీఎం చంద్రబాబు ఇచ్చారు.శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి కాలి నడకన తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, దేవాన్ష్ లు వెళ్లారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ లో భక్తులకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు వడ్డించారు.


Tags:    

Similar News