పోలవరం జిల్లాలోకి పులి
కాకినాడ జిల్లాలో ఇన్నాళ్లు సంచరించిన పులి ఇప్పుడు పోలవరం ప్రాంతంలోకి ప్రవేశించింది
కాకినాడ జిల్లాలో ఇన్నాళ్లు సంచరించిన పులి ఇప్పుడు పోలవరం ప్రాంతంలోకి ప్రవేశించింది. పోలవరం ప్రాంతంలోని రాజవొమ్మంగి మండలం వీరభద్రాపురం పరిసరాల్లో పులి సంచారం ఉందని స్థానికులు చెబుతున్నారు.జాతీయ రహదారిని దాటి పులి ఈ ప్రాంతంలోకి ప్రవేశించిందని అటవీ శాఖ అధికారుల కూడా నిర్ధారించారు.
అప్రమత్తం చేసిన అధికారులు...
ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరారు. కొట్టం పాలెం, గవరయ్య పేట, గొండోలు, కొనలోవ ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి తిరిగి ఏలేరు ప్రాంతంలోని జలాశయం సమీపంలోకి చేరుకుంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పులి రాకపోకలను గమనిస్తూ అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.