అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి: సునీత పిటిషన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు

Update: 2023-06-07 02:14 GMT

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొన్నందుకు ఆయనకు బెయిల్ రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరారు. అవినాశ్‌పై సీబీఐ ఇప్పటి వరకూ దాఖలు చేసిన ఛార్జిషీట్లు, అఫిడవిట్లు అన్నీ తీవ్రమైనవేనని, కానీ తెలంగాణ కోర్టు మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. జూన్ 30లోగా దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినందున విచారణ సజావుగా సాగేందుకు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరారు. సునీత తరపు న్యాయవాదులు ఈ కేసును బుధవారం ధర్మాసనం ముందు ప్రస్తావించనున్నారు.

మంగళవారం సీబీఐ కోర్టులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ పై మంగళవారం సీబీఐ కోర్టు లో విచారణ జరిగింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సీబీఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదించారు. ఆరోపణలు మాత్రమే సీబీఐ పరిగణలోకి తీసుకుందని.. అక్రమ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి అని, ఆయన నేరం చేశారనడానికి ఎక్కడా సరైన సాక్ష్యాలు లేవన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదని అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై పలు దఫాలుగా సుధీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం..షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని చెప్పింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని సూచించింది.


Tags:    

Similar News