నేడు నరసాపురానికి జగన్

వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నరసాపురంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు

Update: 2022-11-21 04:02 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నరసాపురంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మత్స్యకార దినోత్సవ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. జగన్ పర్యటనలో ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్ హార్బర్ కు శంకు స్థాపన చేయనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జగన్ నరసాపురం చేరుకుంటారు.

3,197 కోట్ల పనులను...
నరసాపురం నియోజకవర్గంలో 3,197 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. అలాగే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, విద్యుత్ సబ్ స్టేషన్, మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు, నరసాపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులను జగన్ ప్రారంభించనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Tags:    

Similar News