Ys Jagan : నేడు వైఎస్ జగన్ పర్యటనలో ఆంక్షలివే

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు

Update: 2025-11-04 05:45 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గం తాడిగడపకు చేరుకున్నారు. రహదారులపై వాహనాల రాకపోకలకు, గుమికూడేందుకు అవకాశం లేదని పోలీసులు తెలిపారు. కేవలం ఐదు వందల మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షరతులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బైకు ర్యాలీలపై...
బైకు ర్యాలీలు వంటివి కూడా చేయకూడదని జగన్ పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వందలాది పోలీసుల మోహరించారు. జగన్ పర్యటించే గ్రామాల వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ నేడు కృష్ణా జిల్లాలో మొంథా తుఫాన్.. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులతో జగన్ మాట్లాడనున్నారు.


Tags:    

Similar News