Ys Jagan : మళ్లీ పాత ఫార్ములాను బయటకు తీసిన జగన్.. ఈసారి ఏమవుతుందో?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

Update: 2026-01-23 09:12 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ స్వయంగా వెల్లడిచారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర 3,600 కిలోమీటర్లకు పైగానే సాగింది. ఆ పాదయాత్ర తనకు అధికారం తెచ్చిపెట్టిందని జగన్ ఇప్పటికీ భావిస్తున్నారు. ఇప్పటి వరకూ పాదయాత్ర చేపట్టిన తర్వాత కొంత పార్టీకి మైలేజీ పెరిగింది. 2004కు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, 2014కు ముందు చంద్రబాబు మీకోసం పాదయాత్ర, 2019 కు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర, 2024 ఎన్నికలకు ముందు నారా లోకేశ్ యువగళం పాదయాత్రలు ఓట్ల వర్షం కురిపించాయన్నది వాస్తవం.

మరోసారి పాదయాత్రకు...
అయితే ఇప్పుడు అదే ఫార్ములాతో మరోసారి జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే ఒకసారి పాదయాత్రతో జనంలోకి వెళ్లి అధికారంలోకి వచ్చిన జగన్ మరోసారి యాత్ర చేపడితే అదే ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా? అన్న సందేహాలు లేకపోలేదు. ఇప్పుడు మళ్లీ జగన్ తన పాత అస్త్రం పాదయాత్రకు సిద్ధమైతే అదే అస్త్రం పదేపదే వాడేస్తే ఫలితం ఉంటుందా అనేదిక్కడ ప్రశ్న.ఇవతల చంద్రబాబు శక్తివంచన లేకుండా సహకరిస్తారు కాబట్టి ఆ ఏరియా వాడుకోవాలి కానీ మళ్ళీ మళ్ళీ అదే పాదయాత్ర వల్ల ఫలితం ఉంటుందా అన్న సందేహం కూడా వైసీపీ నేతల్లో ఉంటుంది. అధికార పార్టీపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని కానీ మళ్లీ పాదయాత్ర చేస్తానంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ ఫలితంపైనే అనుమానం.
ప్రజా సమస్యలపై...
అందుకే జగన్ పాదయాత్ర కంటే ముందుగా జనం సమస్యలపై పోరాటం చేయాలి. 2014 నుంచి 2019 వరకూ జగన్ అంటే పాదయాత్రకు ముందు జగన్ ప్రజా సమస్యలపై పోరాడారు. ఆమరణ దీక్షలు చేశారు. రైతుల కోసం,విద్యార్థుల కోసం ఆయన దీక్షలు చేశారు. అవి చాలా వరకూ ఫలితాలు ఇచ్చాయన్నది పార్టీ సీనియర్ నేతల అభిప్రాయంగా ఉంది. పాదయాత్ర అంటే కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా రావచ్చేమో కానీ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతే తప్ప అనవసరమైన లాజిక్కులతో మళ్లీ పాదయాత్ర చేస్తే నేతలకు ఇబ్బందులు తప్ప మరేదీ ఉండదన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News