Sajjala : పోలీసుల అతి మరీ ఎక్కువవుతుంది : సజ్జల

ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అతి మరీ ఎక్కువవుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

Update: 2025-06-07 07:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అతి మరీ ఎక్కువవుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పోలీసులు భయాందోళనలు సృష్టిస్తున్నారని, కొందరు నేతలను మచ్చిక చేసుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులు పెడుతూ కార్యకర్తలను వేధిస్తున్నారన్న సజ్జల ఈరోజు విజయవాడ రమేష్ ఆసుపత్రిలో బలవన్మరణానికి ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామార్శించారు.

అక్రమ కేసులు పెడుతూ...
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పొలిటికల్ బాస్ లు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక శక్తుల రాజ్యమేలుతున్నాయన్న సజ్జల ఆంధ్రప్రదేశ్ లో ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుస్తుందని అన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇక ఈ అరాచకాలను అడ్డుకునేందుకు ఎవరు రావాలని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి దాడులను ఎవరూ సహించరని అన్నారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉంటారని అనుకోవద్దని హెచ్చరించారు.


Tags:    

Similar News