YSRCP : నేడు వైసీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం
నేడు వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది.
నేడు వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వరసగా వైసీపీ నేతల అరెస్ట్ లపై చర్చించనుందని తెలిసింది. దీంతో పాటు పార్టీలో కొందరి చేరికలపై కూడా జగన్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
గ్రామస్థాయిలో...
దీంతోపాటు చంద్రబాబు హామీలను అమలుపర్చకపోవడంపై వైసీపీ గ్రామ స్థాయిలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను గురించి కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని తెలిసింది. ఇలాగే లులు సంస్థలకు విజయవాడ, విశాఖ నగరాల్లో అతితక్కువ ధరకు 99 ఏళ్లు అతి విలువైన భూమిని లీజుకు ఇచ్చిన ప్రభుత్వ వైఖరిపై ఆందోళన చేసే దిశగా కార్యక్రమాలను రూపొందించేందుకు కూడా చర్చిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు రాజకీయ పరిణామాలను గురించి కూడా జగన్ నేతలతో చర్చించనున్నారు.