Ys Jagan : నేడు వైఎస్ జగన్ కీలక సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
వైసీపీ అధినేత జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం కానున్నారు
వైసీపీ అధినేత జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదిన్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులను ఈ సమావేశానికిఆహ్వానించారు. జరుగుతున్న రాజకీయ పరిణామలతో పాటు, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్న్నారు.
పెడుతున్న కేసులు...
వైసీపీ నేతలు, కార్యకర్తలపై పెడుతున్న కేసులను కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు నుంచి వచ్చిన జగన్ జిల్లా అధ్యక్షులతో సమావేశమైన తర్వాత వారి నుంచి క్షేత్రస్థాయిలో అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఫీడ్ బ్యాక్ ను తెలుసుకోనున్నారు. భవిష్యత్ కార్యాచరణణను ప్రకటించే అవకాశముంది.