YS Jagan : నేడు వైసీపీ కీలక సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. కొద్ది రోజుల క్రితం పీఏసీ మెంబర్లుగా 33 మంది సభ్యులను నియమించారు. కో-ఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు.
భవిష్యత్ కార్యాచరణపై...
ఈ సమావేశంలో జగన్ జిల్లాల పర్యటనతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చకు వచ్చే అవకాశముంది. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంపై ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని ఇందుకు తగిన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశాలున్నాయి.