YSRCP : వైసీపీ పోరుబాట.. ఆందోళనలకు రెడీ
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు
ycp chief ys jagan
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. డిసెంబరు 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగాలని వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. వైసీపీ కీలక నేతల సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.డిసెంబరు 11వ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు నిర్వహించాలనినిర్ణయించారు. కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదనిజగన్ అన్నారు.
జనవరి మూడో తేదీ వరకూ...
ఇరవై వేల రూపాయలపెట్టుబడి సాయాన్ని రైతులకు అందచేయాలని, ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని 11న ఆందోళనలు చేయనున్నారు. డిసెంబరు 27న పెంచిన విద్యుత్తు ఛార్జీలపై ఆందోళన చేయనున్నారు. సీఎండీ కార్యాలయాలు, ఎస్ ఈ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించాలన్నారు. జనవరి 3వతేదీన ఫీజు రీయెంబర్స్ మెంట్ అంశంప ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. పెండింగ్ బకాయీలను వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ ను కలసి వినతి పత్రాన్నిసమర్పించనున్నారు.