తిరుమలలో భట్టి విక్రమార్క కుటుంబం
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. శ్రీవారిని తమ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకోవడం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య, సాక్షి లకు ఆయురారోగ్యాలు కలగాలని పండితులు ఆశీర్వదించారు
తెలుగు రాష్ట్రాల ప్రజలు...
తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మల్లు భట్టి విక్రమార్క తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించి, విజన్ 2047లక్ష్యంగా ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని భట్టి విక్రమార్క గారు స్వామివారిని కోరుకున్నారు.