పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం

పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం పరిసరాల్లో పెద్దపులి సంచారం కలకం రేపుతుంది.

Update: 2026-03-09 04:35 GMT

పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం పరిసరాల్లో పెద్దపులి సంచారం కలకం రేపుతుంది. స్థానికులకు పులి కనపడటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు.ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా పులి సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

పులి జాడ కోసం...
పులి జాడ కోసం విస్తృతంగా అటవీ సిబ్బంది గాలిస్తున్నారు పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా పులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని, పులి పట్టుకునేంత వరకూ తగిన జాగ్రత్తలు పాటించాలని, అప్పటివరకూ సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒంటరిగాఎవరూ పొలాలకు వెళ్లవద్దని, పెంపుడు జంతువులను ఇళ్లవద్దనే కట్టేసి ఉంచాలని సూచించారు.


Tags:    

Similar News