మూడు రోజుల భారీ వర్షాలు

రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు అలాగే కొన్నిచోట్ల భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Update: 2023-05-01 02:26 GMT

రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు అలాగే కొన్నిచోట్ల భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉండనున్నాయని తెలిపింది. ఇవాళ రాత్రి, రేపు తెల్లవారు జామున కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. .మే 1, 2 తేదీలలో ఎక్కువ చోట్ల భారీ ఉరుములు మెరుపులు పిడుగులు వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈరోజు, రేపు....
విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నేడు కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పిడుగులు పడే...
వైఎస్‌ఆర్‌,సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపుల వర్షంతో కూడి "పిడుగులు" పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. చెట్ల కింద ఎవరు ఉండవద్దని హెచ్చరికలు జారీ చేసింది. రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల సంస్థ పేర్కొంది.


Tags:    

Similar News