వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదయింది

Update: 2025-12-18 04:31 GMT

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదయింది. విజయవాడలో ఈ కేసు నమోదయింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మాచవరం పోలీస్ స్టేషన్ లో...
2024 జులై నెలలో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ సునీల్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరొక ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News