Ys Jagan : నేడు గవర్నర్ తో జగన్ భేటీ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు

Update: 2025-12-18 02:17 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఉదయం పది గంటలకు లోక్ భవన్ కు జగన్ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం ప్రయివేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించింది. ఈ సంతకాలు చేసిన ప్రతులను జగన్ గవర్నర్ కు అందించనున్నారు.

కోటి సంతకాల పత్రాలను...
తొలుత ఆ సంతకాలు చేసిన పత్రాలున్న వాహనాలను జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం గవర్నర్ అబ్లుల్ నజీర్ తో భేటీ అవుతారు. తొలుత జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయ కర్తలు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశమవుతారు. అనంతరం గవర్నర్ వద్దకు జగన్ వెళతారు.


Tags:    

Similar News