Guntrur : గుంటూరు కార్పొరేషన్ లో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇంటి పన్ను రశీదులో పేరు మార్పిస్తామని, అనధికారక నిర్మాణాలు ప్రోత్స హిసున్న ముగ్గురు ఉద్యోగులపై జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు చర్య లు తీసుకున్నారు. అక్రమవసూళ్లపై అందిన ఫిర్యాదులతో మున్సిపల్ కమిషనర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నార.
అవినీతి అక్రమాలపై...
సంగడిగుం టలోని సచివాలయం 45లో డేటా ఎంట్రీ ఆపరేటర్ సాయికుమార్ పైన, అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై సస్పెండ్ చేశారు.కాకాని రోడ్డులో ఇన్చార్జి టీపీబీఓ యాసిర్ అహ్మద్, ప్లానింగ్ సెక్రటరి ఆవుల వెంకటకృష్ణలను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, సచి వాలయ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినా, అనధికారికంగా డబ్బు లు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..