Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు

ఈరోజు సాయంత్రం ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-12-18 05:04 GMT

ఈరోజు సాయంత్రం ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు. రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులతో పాటు ఇతర నిధులకు సంబంధించి కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించే అవకాశముంది.

కేంద్ర మంత్రులతో భేటీ
రేపు కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉండనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశముంది. ఈ పర్యటనలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ తో పాటు మరికొందరు నేతలను చంద్రబాబు కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News