Kesineni Nani : శత్రువులెవరో నాకు తెలుసు.. ఎవరితోనైనా పోరాడతా
విజయవాడ టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
mp kesineni nani
విజయవాడ టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా చూడకూడదని కొందరు అనుకుంటున్నారన్న నాని అలాగయితేనే తాము దోచుకోవచ్చని భావిస్తున్నారని ఆరోపించారు. తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, దోచుకోవడానికి మాత్రం రాలేదని ఆయన తెలిపారు. తనను తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎవరైనా చేసుకోవచ్చని ఆయన అన్నారు.
పశ్చిమ నియోజకవర్గం నుంచి...
బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీలు లేదా మైనారిటీలు మాత్రమే పోటీ చేస్తారని, తన కుటుంబం నుంచి ఎవరూ బరిలోకి దిగరని కేశినేని నాని స్పష్టం చేశారు. అయితే పశ్చిమ నియోజకవర్గాన్ని కొందరి నేతల కబంధ హస్తాల నుంచి కాపాడేందుకు తాను చివర వరకూ ప్రయత్నిస్తానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు ఈసారి మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని ఆయన తెలిపారు. నీతి నిజాయితీపరులే రాజకీయాల్లోకి రావాలని కేశినేని నాని పిలుపు నిచ్చారు.