Vijayawada : నేటి నుంచి భవానీదీక్షల విరమణ
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు భవానీదీక్షల విరమణ చేయనున్నారు. ఈరోజు ఉదయం 6.30 గంటలకు హోమగుండాల అగ్నిప్రతిష్టాపన జరిగింది. ఉదయం 6 గంటలకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదర్శన ప్రారంభమయింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.
అంతరాలయ దర్శనాలు రద్దు...
భవానీ దీక్షల సమయంలో అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని ఆర్జిత సేవలు, టికెట్ దర్శనాలు రద్దు చేసిన దేవస్థానం కమిటీ ఐదు క్యూలైన్లలో భవానీ దీక్షదారులకు ఉచిత దర్శనానికి అనుమతి ఇస్తుంది. భక్తుల భద్రత పర్యవేక్షణకు 320 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పటు చేశారు. కొండ దిగువన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ఇంద్రకీలాద్రిపై మొత్తం ఇరవై ఎనిమిది వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి భవానీ దీక్షలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.