ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబుకు షాక్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు

Update: 2023-09-27 11:32 GMT

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులు కూడా నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నారా లోకేశ్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదననలు వినిపించారు. ఈ పిటిషన్ తొలుత జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే, విచారణ నుంచి జస్టిన్ ఎస్వీ భట్టి తప్పుకున్నారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ ముందు సిద్ధార్థ్ లూథ్రా మళ్లీ మెన్షన్ చేశారు. పిటిషన్ ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. అయితే సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News