రాజధానికి మళ్లీ భూములు ఇవ్వండి : వసంత
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టతో చేసే మలీవిడత పూలింగ్ కు రైతులు సహకరించాలని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టతో చేసే మలీవిడత పూలింగ్ కు రైతులు సహకరించాలని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కోరారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు రాజధాని రైతులు పూర్తి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన కోరారు విజన్ 2047 ను భావితరాల వారికి మంచి భవిష్యత్తును అందిస్తుందని తెలిపారు రాజధాని భవిష్యత్తు కోసం 40 వేల ఎకరాల భూమి అవసరమని పేర్కొన్నారు. రైతులు స్వచ్ఛందంగా రాజధాని అభివృద్ధి కోసం భూములు ఇవ్వాలని వసంత కోరారు.
రాష్ట్రాభివృద్ధి జరగాలంటే...?
గతంలో చంద్రబాబు నాయుడు మొదటి విడత పూలింగ్ నిర్వహించినప్పుడు ఎలా అయితే స్వచ్ఛందంగా రైతులు తమ పొలాలను రాజధాని కొరకు అందించారో అదేవిధంగా మరో మారు రైతులు త్యాగం చేయవలసిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పెద్దపెద్ద పరిశ్రమలు రావాలని దానికి సమృద్ధిగా వనరులను కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని, హైదరాబాదు నుంచి రాజధాని లేక ఉత్త చేతులతో వచ్చామని చంద్రబాబు తన మేధస్సుతో రాజధానిని ఏర్పాటుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.