తిరుమలలో పెరిగిన రద్దీ

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్లు నిండిపోయి భక్తులు రామ్ బగీచా అతిథి గృహం వరకూ క్యూలో ఉన్నారు.

Update: 2022-07-03 02:19 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్లు నిండిపోయి భక్తులు రామ్ బగీచా అతిథి గృహం వరకూ క్యూలో ఉన్నారు. తిరుమల కొండపై దాదాపు లక్ష మంది భక్తులు ఉంటారని అంచనా. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయంల పడుతుందని తిరుమల తిరుపతి అధికారులు వెల్లడించారు.

ఆదాయం 4.34 కోట్లు....
నిన్న తిరుమల శ్రీవారిని 88,026 మంది భక్తులు దర్శించుకున్నారు. 50,652 మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.34 కోట్ల రూపాయలు. రేపటి నుంచి కొంత రద్దీ తగ్గుముఖం పట్టే అవకాశముంది.


Tags:    

Similar News