నేడు విజయవాడ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు

Update: 2025-04-27 04:07 GMT

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ ఎస్ కన్వెన్షన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా సెమినార్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్, బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ది వెన్యూ కన్వెన్షన్ హాల్ లో కార్యక్రమం జరుగుతుంది.

సత్యకుమార్ రచించిన...
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ రచించిన సామాజిక,రాజకీయ వ్యాసాల సంకలనం “సత్యకాలమ్ 2” పుస్తకావిష్కరణ వేడుకకు కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో కిషన్ రెడ్డి పర్యటనలో పెద్దయెత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశాలున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కమలం పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.


Tags:    

Similar News