Andhra Pradesh : ఎనిమిది గంటల పాటు సాగిన మిధున్ రెడ్డి విచారణ

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి విచారణ ముగిసింది.

Update: 2025-04-19 12:21 GMT

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి విచారణ ముగిసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు విచారించారు. మద్యం స్కాం కేసులో మిధున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఆయన తన న్యాయవాదితో సహా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ విచారణలో హైదరాబాద్, విజయవాడల్లో విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని, లిక్కర్ పాలసీని ఏ విధంగా నిర్ణయించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన మిధున్ రెడ్డి ఆరు గంటల వరకూ అక్కడే ఉన్నారు.

లిక్కర్ స్కామ్ లో...
నిన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించినప్పుడు తన ఇంట్లోనే లిక్కర్ కు సంబంధించి సమావేశాలు జరిగాయని, ఇందులో మిధున్ రెడ్డి కూడా పాల్గొన్నారని తెలిపారు. అంతేకాదు లిక్కర్ పాలసీని కూడా నిర్ణయించారన్నారు. అయితే ఇందులో ఎంత మేరకు నగదు చేతులు మారిందన్నది మాత్రం తనకు తెలియదని ఆయన తెలిపారు. విజయసాయిరెడ్డి చెప్పిన వివరాల మేరకు నేడు మిధున్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. మిధున్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ పై సంతకాలు తీసుకున్నారు. మరోసారి నోటీసులు ఇచ్చి మిధున్ రెడ్డిని విచారించే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News