నేడు లిక్కర్ స్కామ్ నిందితులు కోర్టుకు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది.

Update: 2025-06-17 04:40 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు అరెస్టయిన నిందితులకు రిమాండ్ ముగియడంతో నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకూ ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

రిమాండ్ ముగియడంతో...
లిక్కర్ స్కాం కేసులో ముగిసిన నిందితుల రిమాండ్ ముగియనుండటంతో నేడు ఏసీబీ విచారణ చేపట్టి రిమాండ్ పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులోని ఏడుగురు నిందితులు నేడు ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు. లిక్కర్ కేసులో అరెస్టయిన రాజ్ కసిరెడ్డీ, చాణక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల రిమాండ్ ముగిసింది.


Tags:    

Similar News