నేడు రాజ్ కసిరెడ్డి విచారణ
నేడు మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నేడు రాజ్ కసిరెడ్డిని విచారించనున్నారు
నేడు మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నేడు రాజ్ కసిరెడ్డిని విచారించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి కీకలం కావడంతో నేడు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. నిన్న శంషాబాద్ లో రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణం కేసులో...
దుబాయ్ నుంచి గోవాకు వచ్చి అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇండిగో విమానంలో చేరుకున్న రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అయితే నేడు మద్యం స్కాం విషయంలో జరిగిన విషయాలపై ప్రధానంగా రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. డబ్బు ఎవరికి చేరిందన్న దానిపై ప్రధానంగా విచారించే అవకాశముంది.