Tirumala : గుడ్ న్యూస్...తిరుమల తరహాలోనే అన్ని చోట్ల అన్న ప్రసాదాలు
తిరుమలలో లభించే అన్న ప్రసాదం తరహాలో అన్ని ఆలయాల్లో తయారు చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు
తిరుమలలో లభించే అన్న ప్రసాదం తరహాలో అన్ని ఆలయాల్లో తయారు చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు. తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోటు సిబ్బందితో శిక్షణ...
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాల తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్నప్రసాదాల పంపిణి పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టిటిడి ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారి నివేదికను తయారు చేయాలన్నారు. టిటిడిలో ఇంకనూ ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా టిటిడి పరిధిలో చేరిన చారిత్రాక ఆలయాలకు, ఇతర ఆలయాలకు ఏఏ ఆలయాలకు వేదపారాయణదారులను నియమించాలి, ఎంత మంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.