Andhra Pradesh : నేటి నుంచి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నేడు గుంటూరు లో ప్రారంభం కానున్నాయి.

Update: 2026-01-03 02:38 GMT

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నేడు గుంటూరు లో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం పది గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రారంభోత్సవ సభ జరగనుంది. మొత్తం మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా నిర్వహించనున్నారు.

సాహితీ సదస్సులు...
తెలుగు ప్రపంచ మహా సభలకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తరలి వస్తున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొంటారు. సన్మానాలు సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలతో పాటు తెలుగు చలన చిత్ర గీతాలాపనలు జరగనున్నాయి. చివరి రోజైన ఐదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొననున్నారు.


Tags:    

Similar News