కడప కార్పొరేషన్ సమావేశం రసాభాస
కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది.
కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్ ఛాంబర్ లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు సహకరించక పోవడంతో మేయర్ ఛాంబర్ లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాము మేయర్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించుకోలేదని, సమావేశాన్ని నిర్వహించుకోవడానికి అధికారులు అవకాశం ఇవ్వకపోవడంతో తాము కార్పొరేషన్ హాలులోనే సమావేశం ఏర్పాటు చేసుకున్నామని మేయర్ సురేష్ బాబు తెలిపారు.
ఒకరిపై ఒకరు ఆరోపణలు...
తమకు అధికారులు సహకరించలేదని, నేడు సర్వసభ్య సమావేశం జరగకపోతే పాలకమండలి రద్దవుతుందని తెలిసి కావాలని ఎమ్మెల్యే చెప్పినట్లు అధికారులు నడుచుకుంటున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆరోపించారు. సమావేశానికి కోరం సభ్యులు హాజరయ్యారని, అందరం తీర్మానాలు చేసుకున్నామని, దీనిపై హైకోర్టుకు నివేదిస్తానని ఆయనచెప్పారు. మరొక వైపు నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఎలా నిర్వాహిస్తారన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి అభ్యంతరం తెలిపారు. మేయర్ ఛాంబర్ లో సమావేశంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు.